Thu Sep 19 2024 02:04:26 GMT+0000 (Coordinated Universal Time)
టైర్ పేలి బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు
టైర్ పేలి ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో..
టైర్ పేలి ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లాలోని హవేలి ఘన్ పూర్ మండలం వద్ద ఓ ప్రైవేటు బస్సు వెళ్తోంది. ఉన్నట్లుంది బస్సు టైర్ పేలడంతో.. బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టింది. హైదరాబాద్ నుంచి అజ్మీర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తల్లీ కూతుళ్లైన అజితా బేగం, దహిగా బేగం లు మరణించినట్లు గుర్తించారు.
Also Read : మంత్రి మేకపాటి మృతి పట్ల ప్రముఖుల సంతాపం
ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులంతా హైదరాబాద్ లోని షాద్ నగర్ కు చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మెదక్ లోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, జేసీబీ సాయంతో బస్సును రోడ్డుపైకి తరలించారు. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story