Thu Mar 19 2026 15:12:48 GMT+0530 (India Standard Time)
కశ్మీరీ పండిట్ పై ఉగ్రవాదుల కాల్పులు
ఆదివారం నుంచి ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఇది నాల్గోసారి. అంతకుముందు పుల్వామాలో ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు..

షోపియాన్ : కశ్మీరీ పండిట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సోమవారం సాయంత్రం కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో బాలకిషన్ అనే పండిట్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ కాల్పుల్లో బాలకిషన్ చేయి, కాలిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. గాయపడిన బాలకిషన్ ను శ్రీనగర్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. బాలకిషన్ కు చికిత్స చేస్తున్న వైద్యులు.. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆదివారం నుంచి ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఇది నాల్గోసారి. అంతకుముందు పుల్వామాలో ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఇద్దరు గాయపడ్డారు. ఆ తర్వాత శ్రీనగర్‌లోని మైసూమా ప్రాంతంలో ఆర్పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా.. మరొకరు గాయపడ్డారు. తదుపరి మరో ఇద్దరిపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. తాజాగా కశ్మీరీ పండిట్ పై కాల్పులు జరపడం కలకలం రేపింది.
Next Story

