Thu Mar 19 2026 23:59:10 GMT+0530 (India Standard Time)
Big Breaking : కేరళలోని క్రిస్టియన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు
కేరళలో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి

కేరళలో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. కేరళలోని కాలామసేరిలో పేలుడు జరిగింది. వరసగా మూడు సార్లు పేలుళ్ళు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్లలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. 23 మంది గాయాలపాలయ్యారు.
గాయపడిన వారిలో...
గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మూడు సార్లు పేలుళ్లు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. పేలుడు సమయంలో కన్వెన్షన్ సెంటర్ లో రెండు వేల మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story

