Fri Sep 13 2024 14:45:25 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది దారుణ హత్య
మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఒకే కుటుంబలో ఎనిమిది మంది హత్యకు గురయ్యారు
మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఒకే కుటుంబలో ఎనిమిది మంది హత్యకు గురయ్యారు. హత్యచేసిన వ్యక్తి కుటుంబ సభ్యుడే కావడం గమనార్హం. తన కుటుంబంలోని ఎనిమిది మంది హత్యచేసిన అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లా బోదల్ కచ్చార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే హత్య చేసిన వ్యక్తికి మానసిక స్థిమితం లేదని పోలీసులు తెలిపారు. పెద్ద సంఖ్యలో హత్యకు గురి కావడంతో పోలీసులు తొలుత బయట వారిని అనుమానించారు.
తర్వాత చెట్టుకు...
ఎవరైనా దోపిడీకి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేశారు. అయితే కుటుంబంలోని ఒక వ్యక్తి ఎనిమిది మందిని హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేయడంతో ఎనిమిది మంది మరణించారని తెలిపారు. కుటుంబంలో ఉన్న తన భార్య, సోదరుడు, కోడలు, మరో చిన్నారి కూడా హత్యకుగురయ్యాడు. మరో చిన్నారి మాత్రం ఈ దారుణం నుంచి బయటపడి ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. హత్య చేసిన తర్వాత చెట్టుకు ఉరేసుకునఅ అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story