Sat Sep 14 2024 10:49:49 GMT+0000 (Coordinated Universal Time)
బైక్ ను ఢీకొట్టి.. తర్వాత పారిపోయేందుకు మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఐదుగురి మృతి
పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జిల్లాలో వేగంగా వచ్చిన ట్రక్కు అనేక వాహనాలను ఢీకొట్టింది. రోడ్డు నిర్మాణం కోసం కాంక్రీట్ ను తీసుకెళుతున్న ట్రక్కు తొలుత బైక్ ను ఢీకొనగా, మోటార్ సైకిల్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన ఆరుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.
పట్టుకునేందుకు...
దీంతో స్థానికులు డ్రైవర్ పట్టుకునేందుకు ప్రయత్నించగా వేగంగా వెళ్లి త్రీవీలర్ ను ఢీకొట్టాడు. తర్వాత కొందరు నడుస్తున్న వారిపై నుంచి ట్రక్ ను పోనిచ్చాడు. దీంతో ఆటో డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణికులు మరణించారని పోలీసులు తెలిపారు. కేవలం పారిపోయే ప్రయత్నంలో మరో నలుగురిని చంపిన ట్రక్ డ్రైవర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story