Mon Mar 16 2026 10:11:28 GMT+0530 (India Standard Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి
ఉత్తర్ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు

ఉత్తర్ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. యూపీలోని బులండ్షహర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ముప్ఫయి మంది వరకూ గాయపడ్డారు. నాగ్లా గ్రామానికి చెందిన కార్మికకులు ఘజియాబాద్ లో ఒక ఫ్యాకర్టీ పనిచేస్తూ రక్షాబంధన్ వేడుకను జరుపుకునేందుకు తమ సొంత గ్రామాలకు వెళ్లుతున్నరు. వీరంతా తమ గ్రామాలకు వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని బస్సు ఢీకొట్టింది.
30 మందికి గాయాలు...
ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడటంతో అతనిని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్సకోసం తరలిస్తుండగా పది మంది మరణించారని వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

