Tue Mar 17 2026 09:41:12 GMT+0530 (India Standard Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం ... ఆరుగురి మృతి
ఉత్తర్ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు

ఉత్తర్ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఉత్తర్ప్రదేశ్ లోని జగన్నాధ్పూర్ గ్రామంలో కారు గోతిలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే భారీ వర్షం కారణం ఒకటయితే అతి వేగమూ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
నీటి గుంతలో పడి...
కారులో ఉన్న ఆరుగురు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారు ఇద్దరూ చిన్నారులే. అయితే మృతులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

