Tue Mar 17 2026 09:41:13 GMT+0530 (India Standard Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆరుగురి మృతి
ఉత్తర్ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు

ఉత్తర్ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఉత్తర్ప్రదేశ్ లోని బ్రజ్ఘాట్ టోల్ ప్లాజా వద్ద కారు ప్రమాదానికి గురైన ఘటనలో ఇంత మంది మరణించారు. టోల్ ప్లాజా వద్ద వేగంగా వచ్చిన కారు ఒక ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ట్రక్కును ఢీకొని...
నిన్న అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేనని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మీరట్ ఆసుపత్రిలో చేర్పించారు.
Next Story

