Thu Mar 19 2026 04:27:28 GMT+0530 (India Standard Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి.. ఏడుగురు మృతి
ఉత్తర్ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు

ఉత్తర్ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో ఇరవై మంది గాయాలపాలయ్యారు. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లాలోని ఉసహార్ ప్రాంతంలో లఖనవూ - ఆగరా ఎక్స్ప్రెస్ హైవే పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నాగాలాండ్ రిజిస్ట్రేషన్ తో ఉన్న బస్సు రాయబరేలి నుంచి ఢిల్లీకి వెళుతూ ప్రమాదానికి గురయింది. రాంగ్ రూట్ లో కారు రావడంతో బస్సు కారును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో అరవై మంది ప్రయాణికులున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
కారు డ్రైవర్ నిర్లక్ష్యమే...
కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. కారును ఢీకొన్న బస్సు పక్కనే ఉన్న గుంటలో పడిపోవడంతో ప్రయాణికులు చనిపోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story

