Sun Mar 15 2026 10:24:15 GMT+0530 (India Standard Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
మధ్య ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు

మధ్య ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఆటోను డంపర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మధ్య ప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఒక డంపర్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఐదుగురు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి.
మృతుల సంఖ్య...
గాయపడిన వారిని వెంటనే పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంటున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

