Thu Feb 05 2026 05:11:09 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం : 5గురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ట్రాక్టర్ ను మినీ బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలపాలయినట్లు తెలుస్తోంది. కృష్ణగిరి జిల్లా కావేరి పట్నం హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
అతివేగమే...
వెంటనే సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story
