Sat Mar 07 2026 19:00:36 GMT+0530 (India Standard Time)
Nalgonda Road Accident : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు

Nalgonda Road Accident :సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. సూర్యాపేట జిల్ల కోదాడ దుర్గాపురం వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అతి వేగమే...
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అతి వేగం, నిద్రలేమి ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

