Sat Mar 07 2026 18:59:44 GMT+0530 (India Standard Time)
Road Accident : ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. కారులో ఉన్న ఇద్దరూ
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొనింది

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొనింది. అంతే కాదు ట్రక్కు కిందకు కారు వెళ్లిపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద జరిగింది. ఆగి ఉన్న లారీ కిందకు వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.
అతి వేగమే...
సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకుని కారును బయటకు తీశారు. కారులో నుంచి రెండు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. కారు నెంబరు మాత్రం TS 04 FA 6894 అని పోలీసులు తెలిపారు. నిద్రమత్తులో ఆగి ఉన్న లారీని చూసుకోకుండా వేగంగా వచ్చి ఢీకొన్నందునే లారీ కిందకు దూసుకెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

