Tue Mar 17 2026 07:52:28 GMT+0530 (India Standard Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం...కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు.

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. రాజస్థాన్ లోని బికనీర్కు వంద కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కును వెనక వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు హర్యానాలోని దబ్బాలీ వాసులుగా గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన...
జైత్ఫూర్ నుంచి హనుమాన్ గఢ్ వైపు వస్తున్న కారు వెనక వైపు నుంచి ట్రక్కును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే కారు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయ కార్యక్రమలు చేపట్టారు. ఒకే కుటుంబంలోని వారంతా మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story

