Thu Mar 19 2026 05:56:56 GMT+0530 (India Standard Time)
Breaking : రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది మరణించారు.

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది మరణించారు. ఒక టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్ లోని థోల్పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఒక టెంపోను బస్సు ఢీకొట్టడంతో ఈ అతి పెద్ద ప్రమాదం సంభవిచిందని అధికారులు తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
చిన్నారులే ఎక్కువ....
ఈ ప్రమాదంలో పదకొండు మంది మరణించారు. మరణించిన వారిలో ఎనిమిది మంది చిన్నారులే కావడంతో మరింత విషాదాన్ని నింపింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

