Thu Mar 19 2026 18:03:26 GMT+0530 (India Standard Time)
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్ జిల్లాలోని పరమాణిక్పుర్ వద్ద ఈ ఘటన జరిగింది. బొలేరో వాహనం కాల్వలోకి దూసుకెళ్లడంతో అందులో ఉన్న ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మృతులంతా ఝూర్సుగూడకు చెందిన వారుగా గుర్తించారు.
అతి వేగమే...
మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. సంబల్పూర్ జిల్లాలో పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

