Fri Mar 20 2026 08:10:46 GMT+0530 (India Standard Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం - పది మంది మృతి
ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మరణించారు.

ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మరణించారు. ట్రాక్టర్ లో వెళుతుండగా ట్రక్కు వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కూలీలను వారణాసికి తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మరికొందరి మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
మృతులంతా...
మరణించిన వారంతా కూలీలనీ, అయితే వీరు ఏ ప్రాంతానికి చెందిన వారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. పోలీసులు స్పాట్ కు చేరుకుని ట్రాఫిక్ నిలిచిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మీర్జాపూర్ సమీపంలోని ప్రాంతానికి చెందిన వారుగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు.
Next Story

