Thu Dec 18 2025 23:01:33 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురి మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. దాదాపు 22 మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు - పూనే జాతీయ రహదారిపై పూనే సమీపంలోని నర్హె ప్రాంతంలో ఈరోజు తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఒక లారీ, ప్రయివేటు బస్సు ఢీకొన్నాయి.
మృతుల సంఖ్య...
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణఇంచారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థిితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
Next Story

