Thu Mar 19 2026 02:59:35 GMT+0530 (India Standard Time)
Road Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం 11 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది మరణించారు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది మరణించారు. ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో పదకొండు మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఓవర్ టేక్ చేయబోయి...
మహారాష్ట్రలోని గోందియా జిల్లా నుంచి భండారకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ద్వా గ్రామ సమీపంలో రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో మొత్తం 36 మంది ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.
Next Story

