Tue Jan 20 2026 13:50:04 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది అక్కడికక్కడే మరణించారు

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది అక్కడికక్కడే మరణించారు. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొని ఒక ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగడంతో పన్నెండు మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే గుణ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ట్రక్కు ఢీకొని...
ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సులో ఉన్న వారిని బయటకు తెచ్చేందుకు శ్రమించారు. కొందరు అద్దాలు పగుల గొట్టుకుని బయటకు దూకారు. కొందరు నిద్రలోనే మరణించారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరపుతున్నారు.
Next Story

