Tue Mar 17 2026 13:46:17 GMT+0530 (India Standard Time)
Kerala Road Accident: లోయలోపడిన వ్యాన్... ముగ్గురి మృతి
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ లోయలోపడి ముగ్గురు మృతి చెందారు.

Kerala Road Accident:కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ లోయలోపడి ముగ్గురు మృతి చెందారు. ఇడుక్కి జిల్లా అదిమాలిలోని మంకులం ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వస్తున్న టెంపో ట్రావెలర్ లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరణించిన ముగ్గురిలో ఒక చిన్నారి కూడా ఉంది. ఈ ఘటనలో పథ్నాలుగు మందికి తీవ్ర గాయాలయ్యాయి.
14 మందికి గాయాలు...
తమిళనాడు నుంచి టెంపో ట్రావెలర్ మున్నార్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

