Sun Mar 08 2026 06:16:49 GMT+0530 (India Standard Time)
Big Breaking : ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
చత్తీస్గడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు

చత్తీస్గడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. బెమెతరా జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీకొట్టడంతో వ్యానులో ఉన్న తొమ్మిది మంది మరణించారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 23 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిని...
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలున్నారని పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Next Story

