Thu Feb 05 2026 05:11:09 GMT+0000 (Coordinated Universal Time)
ఛత్తీస్ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం : 11 మంది మృతి
ఛత్తీస్ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించారు

ఛత్తీస్ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించారు. ఛత్తీస్ఘడ్ లోని భాటపరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు, గూడ్స్ ఒకానిని ఒకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా, మరో పది మంది తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
అతి వేగమే...
క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా సిగ్మాలోని ఖిలోరా గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఒక వేడుకకు హాజరై వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
