Sun Mar 08 2026 06:15:35 GMT+0530 (India Standard Time)
Bihar Road Accident: బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటోను ఢీకొట్టడంతో తొమ్మిది మంది మరణించారు

Bihar Road Accident:బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటోను ఢీకొట్టడంతో తొమ్మిది మంది మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బీహార్ లోని లక్ష్మీసరాయ్ జిల్లాలోని రామ్‌గఢ్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జులానా గ్రామం సమీపంలో ఈరోజు ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో...
ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో పదిహేను మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు వెంటనే చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎక్కడి వారన్నది ఇంకా తెలియరాలేదు.
Next Story

