Thu Mar 19 2026 18:24:11 GMT+0530 (India Standard Time)
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్ డెడ్ అయ్యారు

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్ డెడ్ అయ్యారు. అనంతపురం జిల్లాలో శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ రోడ్డు వద్ద లారీని కారు ఢీకొట్టింది. మితి మీరిన వేగంతో పాటు, టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
తాడిపత్రి నగరంలో...
తాడిపత్రి నగరంలో ఒక కార్యక్రమంలో పాల్గొని వస్తున్న వీరి కారు ప్రమాదానికి గురైంది. మృతులందరూ అనంతపురానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే వెంటనే పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని సహాయక కార్యక్రమాలను చేపట్టారు. మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story

