Sun Mar 15 2026 07:41:21 GMT+0530 (India Standard Time)
Road Accident : కోనసీమ జిల్లాలో రోడ్డుప్రమాదానికి నలుగురు యువకుల బలి.. పుట్టినరోజు నాడే మరణం
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మరణించారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మరణించారు. లారీని ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. యానాం నుంచి ఆటోలో వస్తుండగా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మామిడికుదురు గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకునేందుకు స్నేహితులంతా కలసి యానాం వెళ్లారు.
యానాం వెళ్లి...
యానాంలో మంచి పార్టీ చేసుకున్నారు. ఫుల్లుగా మద్యం తాగారు. మొత్తం ఎనిమిది మంది యువకులు ఆటోలో బయలుదేరి యానాం వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మద్యం పార్టీ పూర్తి చేసుకుని ఆటోలో తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న ఆటో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాపే నవీన్, కొత్తాబత్తుల జతిన్, నల్లి నవీన్, కుమార్, వల్లూరి అజయ్ లు మరణించారు. మిగిలిన నలుగురి యువకులకు తీవ్రగాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుట్టినరోజు నాడే జతిన్ మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Next Story

