Wed Oct 16 2024 04:45:03 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్.. ఐదుగురు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గుడిహత్నూలులో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఐదుగురు మరణించడంతో రహదారి రక్తసిక్తమయింది. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఒక కుటుంబం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు బయలుదేరింది. అయితే నిన్న అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
అతివేగమేనా?
గుడిహత్నూర మండలం మేకలగండి గ్రామం వద్ద కారు డివైడర్ ను ఢీకొట్టడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మితి మీరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నప్పటికీ, డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ ను ఢీకొట్టారని మరికొందరు చెబుతున్నారు. గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను షేక్ మొయినుద్దీన్, ఉస్మానుద్దీన్, మహ్మద్ లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story