Sun Mar 22 2026 23:46:45 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం : 42 మంది మృతి
పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 42 మంది మరణించారు

పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 42 మంది మరణించారు. కెట్టా నుంచి కరాచీ వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. అనంతరం బస్సుకు నిప్పు అంటుకోవడంతో 42 మంది ప్రయాణికులు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.
అతివేగమే...
బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులున్నారని, వీరిలో 42 మంది చనిపోయినట్లు తెలిపారు. ఒక మహిళ, చిన్నారితో సహా ముగ్గురిని సహాయక బృందాలు కాపాడాయి. సహాయక చర్యలు వెంటనే ప్రారంభించారు. ఇప్పటి వరకూ 17 మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
Next Story

