Tue Mar 17 2026 11:38:10 GMT+0530 (India Standard Time)
Breaking : బస్సు - ట్రక్కు ఢీ 19 మంది మృతి
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పందొమ్మిది మంది మరణించారు

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పందొమ్మిది మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర మెక్సికోలోజరిగిన ఈ ఘటన విషాదం అనేక కుటుంబాల్లో విషాదం నెలకొల్పింది.
ప్రమాద సమయంలో...
ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సులోని 19 మంది మరణించగా 18 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సినావాలో జాతీయ రహదారిపై ట్రక్కును ఢీకొట్టడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది.
Next Story

