Sun Feb 01 2026 16:48:09 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం : 19 మంది మృతి
మెక్సికో లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు.

మెక్సికో లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ జకాటెకాస్ లోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బస్సు ట్రాక్టర్ ను వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరగడంతో 19 మంది మరణించగా, ఆరుగురికి గాయాలయ్యాయి.
అతివేగం వల్లనే...
అతి వేగంతో ప్రయాణమే ఈ ప్రమాదానికి గల కారణమని తెలుస్తోంది. బస్సు, ట్రాక్టర్ రెండు కాల్వలో పడిపోయాయి. అయితే కాల్వ నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక బృందాలు శ్రమించాల్సి వచ్చింది. బస్సు డ్రైవర్ తప్పిదం వల్లనే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాధమికంగా గుర్తించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

