Sat Mar 21 2026 04:49:13 GMT+0530 (India Standard Time)
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయుల మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయులు మరణించారు

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయులు మరణించారు. మరణించిన వారు ముగ్గురూ మహిళలే. సౌత్ కరోలినాలో జరిగిన ఈ ప్రమాదంలో గుజరాత్ లోని ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్ గా గుర్తించారు. అయితే వారు ముగ్గురు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టడంతో ముగ్గురు మరణించారు.
అతి వేగమే...
అత్యంత వేగంతో కారు ప్రయాణించడం వల్లనే ముగ్గురు భారతీయ మహిళలు మరణించారు. అతి వేగంతో వాహనం అదుపు తప్పి కారు నాలుగైదు పల్టీలు కొట్టడంతో చెట్లపైకి ఎగిరి ఇరుక్కుపోయింది. దాదాపు ఇరవై అడుగుల ఎత్తు పైకి లేచి పడటంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఒకరిని ఆసుపత్రికి తరలించారు.
Next Story

