Sun Mar 15 2026 09:18:57 GMT+0530 (India Standard Time)
ఘోర విమాన ప్రమాదం
నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మండు నుంచి పాఖారా వెళుతున్న విమానం ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది

నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మండు నుంచి పాకారా వెళుతున్న విమానం ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. దీంతో పెద్దయెత్తున మంటలు వ్యాపించాయి. విమానం ప్రమాదం జరిగిన సమయంలో 68 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది ఉన్నారని చెబుతున్నారు.
పది మంది భారతీయులు...?
ప్రయాణికుల్లో పది మంది భారతీయులు ఉన్నట్లు చెబుతున్నారు. సహాయక చర్యలను వెంటనే ప్రారంభించారు. ఎంత మంది ప్రాణాలు కోల్పోయిందీ? ఎంత మంది బయటపడిందీ ఇంకా తెలియరాలేదు. మారికాసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
- Tags
- plane crash
- nepal
Next Story

