Thu Mar 19 2026 21:15:02 GMT+0530 (India Standard Time)
Gang Rape : హైదరాబాద్‌లో దారుణం.. మహిళ సామూహిక అత్యాచారం
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తార్నాక ప్రాంతంలో ఒక మహిళ గ్యాంగ్ రేప్‌నకు గురయింది.

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తార్నాక ప్రాంతంలో ఒక మహిళ అత్యాచారానికి గురయింది. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 7వ తేదీన రాత్రి బస్ కోసం వేచి చూస్తున్న మహిళను ప్రశాంత్ నగర్ కు చెందిన బర్నే ఏసు మాటలు కలిపాడు. అతడు ప్రశాంత్ నగర్ కు వెళ్తుండగా మహిళ తారసపడింది.
మాటలు కలిపి...
లాలాపేటలో దింపుతానని చెప్పి తన వాహనంపై ఎక్కించుకున్నాడు. అయితే ఆమెను వేరే మార్గంలో ప్రశాంత్ నగర్ రైల్వే కార్టర్స్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన స్నేహితులు శ్రీగిరి ప్రశాంత్ కుమార్, తరుణ్, రోహిత్, సీత మధుయాదవ్ లను పిలిచాడు. ఐదుగురు కలిసి అత్యాచారం చేసినట్లు పోలీసులు కసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Next Story

