Thu Mar 19 2026 03:00:18 GMT+0530 (India Standard Time)
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడటంతో?
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడి పది మందికి పైగా మరణించారు.

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడి పది మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. బస్సు లోయలో పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తరాఖండ్ లోని అల్మోరా లోయలో ఈ బస్సు పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.
అతివేగమేనా?
గీతాజాగీర్ నది లోయలో పడిన బస్సులో నుంచి ప్రయాణికులను బయటకు తీయడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది.
Next Story

