Fri Dec 05 2025 16:32:41 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో లోయలో పడిన బస్సు.. ఇద్దరు పరిస్థితి విషమం
వైఎస్సార జిల్లా పులివెందులలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లోయలో పడింది.

వైఎస్సార జిల్లా పులివెందులలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లోయలో పడింది. దాదాపు ముప్ఫయి అడుగు ఉన్న లోయలో పడటంతో ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన పల్లె వెలుగు బస్సు డ్రైవర్ నేరుగా లోయలో బస్సును పడేశారు.
25 మందికి గాయాలు...
ఈ ఘటనలో ఇరవై ఐదు మంది ప్రయాణికులకు గాయాలు కాగా, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కడప నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగంది. వాహనాలను తప్పించ బోయిన డ్రైవర్ బ్రేక్ వేయడంతో స్కిడ్ అయి అది లోయలో పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story

