Fri Dec 05 2025 15:53:59 GMT+0000 (Coordinated Universal Time)
రైల్వే స్టేషన్ లో కుప్పకూలిని పైకప్పు.. శిధిలాల కింద?
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ట్యాంకర్ కూలిపోయింది

ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో నిర్మాణంలో ఉన్న ట్యాంకర్ కూలిపోయింది. పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అనేక మంది శిధిలాల కింద ఉన్నారని తెలిసింది. వారిని బయటకు తీసే ప్రయత్నాలు పోలీసులు వెంటనే చేపట్టారు. అయితే శిధిలాల కింద అనేక మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులుచెబుతున్నారు.
శిధిలాల కింద...
ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు శిథిలాల కింద నుంచి కొందరిని మాత్రమే మందిని బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో దాదాపు ముప్ఫయి మంది కూలీలు పని చేస్తున్నట్లు చెబుతున్నారు. స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Next Story

