Mon Feb 02 2026 02:16:12 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కర్ణాటకలో యాక్సిడెంట్.. 8 మంది ఏపీ వాసుల మృతి
కర్ణాటక లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ చిక్బల్లాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు

కర్ణాటక లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ చిక్బల్లాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. టాటా సుమోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతులంతా సత్యసాయి జిల్లా గోరంట్ల వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమే కారణమని పోలీసులు ప్రాధమికంగా అభిప్రాయపడుతున్నారు.
మరికొందరికి గాయాలు...
ఈ ప్రమాదలో మరికొందరు గాయపడినట్లు తెలిసింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదస్థలిలో సహాయ కార్యక్రమాలను చేపట్టారు.
Next Story

