Sat Mar 07 2026 20:26:43 GMT+0530 (India Standard Time)
ఘోర ప్రమాదం...8 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.

ఉత్తర్ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఉత్తర్ప్రదేశ్ లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవేపైనే ఈ ప్రమాదం జరిగింది. రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బస్సులు ఢీకొని....
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. దీంతో వారిని లక్నోలోని ట్రూమా సెంటర్ కు అధికారులు తరలించారు. బీహార్ నుంచి ఢిల్లీకి వెళుతున్న రెండుబస్సులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బారబంకి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారు ఎక్కువ మంది బీహార్ వాసులుగా గుర్తించారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు.
Next Story

