Sat Jan 31 2026 14:47:25 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. పదహారు మంది మృతి
జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడటంతో పదహారు మంది మృతి చెందారు.

జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడటంతో పదహారు మంది మృతి చెందారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి దాదాపు 150 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో పదహారు మంది మృతి చెందారు. ఇరవై ఐదు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.బస్సు ఉత్తర్ప్రదేశ్ లోని హత్రాస్ నుంచి జమ్మూ కాశ్మీర్లోని శివ్ ఖోడికి వెళుతోంది. చోకి చోరా ప్రాంతంలోని తంగ్లీ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతోనే బస్సు లోయలో పడటానికి కారణమని ప్రాధమికంగా నిర్ధరాించారు.రాజౌరి జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
మృతుల సంఖ్య...
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక ప్రజల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. క్షతగాత్రులను జమ్మూలోని అఖ్నూర్ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. లోయలో పడటాన్ని చూసిన చుట్టు పక్కల ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. . పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ట్వీట్ చేస్తూ చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది.
Next Story

