Thu Mar 19 2026 03:37:06 GMT+0530 (India Standard Time)
Big Breaking : స్కూల్ బస్సు బోల్తా.. ఆరుగురు విద్యార్థుల మృతి
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మరణించారు

హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మరణించారు. మరో ఇరవై మందికి గాయాలయ్యాయి. హర్యానా రాష్ట్రంలోని మహేంద్రగడ్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మరణించారు. ప్రమాద ఘటన తెలియడంతో వెంటనే స్థానికులు సహాయ చర్యలు ప్రారంభించి పోలీసులకు సమాచారం అందించారు.
క్షతగాత్రులను...
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది వరకూ విద్యార్థులున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

