Fri Dec 05 2025 14:35:21 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : పడవ ప్రమాదం..14 మంది విద్యార్థుల మృతి.. మరికొందరు గల్లంతు
గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. వడోదరలో పడవ మునిగి 14 మంది విద్యార్థులు మృతి చెందారు.

గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. వడోదరలో పడవ మునిగి ఎనిమిది మంది విద్యార్థులు మృతి చెందారు. ప్రమాద సమయంలో 27 మంది విద్యార్థులున్నట్లు తెలిపారు. అయితే పడవ మునగడంతో మిగిలిన విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. విద్యార్థుల ఆచూకీ కోసం సహాయక చర్యలు గాలింపు చర్యలు చేపట్టారు. విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది.
సామర్థ్యానికి మించి...
అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పరిమితికి మించి, సామర్థ్యానికి మించి విద్యార్థులు పడవలో ప్రయాణించేందుకు ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా గల్లంతయిన విద్యార్థుల కోసం ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

