Sun Mar 15 2026 21:34:54 GMT+0530 (India Standard Time)
Road Accident : బస్సు ప్రమాదం.. పన్నెండు మంది మృతి.. ఉగాది వేళ విషాదం
ఛత్తీస్గడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది మరణించారు.

ఛత్తీస్గడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉగాది వేళ ఈ ప్రమాదం కొన్ని కుటుంబాల్లో విషాదం నింపింది. బస్సు గోతిలోపడటంతో పన్నెండు మంది మరణించారు. మరో పన్నెండు మంది వరకూ గాయపడ్డారు. ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రయివేటు సంస్థ తమ ఉద్యోగులను బస్సులో తీసుకెళుతుండగా నిన్న రాత్రి కేడియా వద్ద బస్సు గోతిలో పడింది. డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను తమ ఇంటికి చేరవేసేందుకు నిన్న రాత్రి బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురయింది.
ప్రమాద సమయంలో...
ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 30 మంది ఉద్యోగులు ఉన్నారు. రోడ్డు పక్కనే ఉన్న నలభై అడుగుల గోతిలో పడటంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. క్షతగాత్రులకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఉగాది వేళ ఆ ఉద్యోగుల ఇళ్లలో ఈ ప్రమాదం విషాదం నింపింది.
Next Story

