Fri Dec 05 2025 23:12:41 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న టెన్షన్
చంద్రగిరి నియోజకవర్గం కూచివారివారిపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతుంది.

చంద్రగిరి నియోజకవర్గం కూచివారివారిపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇరువర్గాలకు జరిగిన దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంది వైసీపీ కి చెందిన ఓ నాయకుడి కారు ఈ ఘటనలో దగ్దమయింది.
పరారీలో సర్పంచ్ ..
ఈఘటనలో సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి పరారయ్యారని చెబుతున్నారు. దీంతో ప్రత్యర్థుల ఇళ్లు ధ్వంసం చేసి బైకులలను గ్రామస్థులు తగులబెట్టారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించారు. నిరంతరం గ్రామంలో పహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
Next Story

