Fri Dec 05 2025 15:55:07 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఈడీ అధికారులపై ఎటాక్... కార్ల అద్దాల పగలకొట్టి.. కర్రలతో దాడి చేసి
పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత తలెత్తింది. టీఎంసీ నేత షాజహాన్ ఇంట్లో సోదాలకు వచ్చిన ఈడీ అధికారులపై దాడి జరిగింది

west bengal:పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎంసీ నేత షాజహాన్ ఇంట్లో దాడులు నిర్వహించడానికి వచ్చిన ఈడీ అధికారులపై స్థానికులు దాడికి దిగారు. ఈ సందర్భంగా ఈడీ అధికారుల తలలు పగిలాయి. కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. నార్త్ ఇరవై నాలుగు పరగణాల జిల్లా సందేశ్ కాళీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రేషన్ కుంభకోణంలో...
రేషన్ కుంభకోణంలో సోదాలు నిర్వహించడానికి షాజహాన్ ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వచ్చారు. ఇది తెలుసుకున్న స్థానికులు అధికారులపై దాడికి దిగారు. రాళ్లతో వారిని వెంబడించారు. వారి వెంట వచ్చిన పోలీసులు కూడా నిస్సహాయలుగా మారిపోయారు. గాయాలపాలయిన ఈడీ అధికారులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో శాంతిభద్రతలు లేవని చెప్పడానికి ఇది ఉదాహరణ అని భారతీయ జనతా పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story

