Sat Mar 07 2026 20:08:03 GMT+0530 (India Standard Time)
తెనాలిలో దారుణం.. బాలుడిపై పాస్టర్ లైంగిక దాడి
బాలుడిని ఏమైందని అడగగా.. తనపై పాస్టర్ చేసిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించాడు. బాలుడు చెప్పిందంతా విన్న..

తెనాలి : గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ ఘటన జరిగింది. బాలుడిపై పాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాస్టర్ అహరోన్ ప్రకాశ్ తనపై లైంగిక దాడి చేసినట్లు బాలుడు తెలిపాడు. బాధిత బాలుడు గత 10 నెలలుగా కల్వరీ ప్రార్థనా మందిరంలోనే ఉంటున్నాడు. బాలుడికి అనారోగ్యంగా ఉండటంతో అతని తల్లిదండ్రులు ఆరా తీశారు.
బాలుడిని ఏమైందని అడగగా.. తనపై పాస్టర్ చేసిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించాడు. బాలుడు చెప్పిందంతా విన్న తల్లిదండ్రులు.. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ బాధిత బాలుడి తల్లిదండ్రులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
Next Story

