Thu Jan 29 2026 01:14:37 GMT+0000 (Coordinated Universal Time)
Chhattisgarh Encounter : మరో భారీ ఎన్కౌంటర్ .. 10 మంది మావోలు మృతి
చత్తీస్గడ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు.

Chhattisgarh Encounter :చత్తీస్గడ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. అబాఝ్మడ్ అటవీప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో మరోసారి మావోలకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. నారాయణ్పూర్ - కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు, పోలీసుల భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మరణించారని అధికారులు తెలిపారు.
మూడు గంటల పాటు...
రెండు వారాల క్రితం 29 మంది మావోయిస్టులు మరణించిన ఘటన మరవకముందే మరోసారి ఈ ఘటన మావోలను కోలుకోలేని షాక్ కు గురి చేసింది. మూడు గంటల పాటు జరిగిన ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించారని, వారి వద్ద నుంచి ఏకే 47 రైఫిల్ తో పాటు పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ ఎన్కౌంటర్ లో ఎవరు మరణించిందీ అనే విషయంపై ఇంకా తెలియలేదు. మృతుల వివరాలను కనుగొనేందుకు భద్రతాదళాలు ప్రయత్నిస్తున్నాయి.
Next Story

