Fri Sep 13 2024 15:03:23 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం : గ్యాస్ సిలిండర్ పేలి 10 గుడిసెలు దగ్ధం
మండలంలోని శామ్యానాయక్ తండాకు చెందిన కొందరు కూలీలు చెరుకు నరికేందుకు తొర్నల్ కు వచ్చారు.
సంగారెడ్డి : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం తొర్నల్ గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ సిలిండర్ పేలడంతో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో 10 గుడిసెలు, 3 ద్విచక్ర వాహనాలు, రూ.2 లక్షల నగదు, వంటసామాగ్రి దగ్ధమయ్యాయి. మండలంలోని శామ్యానాయక్ తండాకు చెందిన కొందరు కూలీలు చెరుకు నరికేందుకు తొర్నల్ కు వచ్చారు.
అక్కడే తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకుని, వాటిలోనూ కుటుంబంతో కలిసి ఉంటూ.. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలోనే ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో గుడిసెలలో ఎంతమంది ఉన్నారు ? ప్రాణనష్టం జరిగిందా ? ఆస్తినష్టం ఎంత జరిగింది ? తదితర అంశాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Next Story