Sat Nov 02 2024 06:23:55 GMT+0000 (Coordinated Universal Time)
టీవీ సీరియల్ నటి మృతి .. పరిశ్రమలో విషాదం
బుల్లితెర నటి పవిత్ర జయరాం మరణించారు. పవిత్ర ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆమె మరణించారు
బుల్లితెర నటి పవిత్ర జయరాం మరణించారు. పవిత్ర ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆమె మరణించారు. ఈ ప్రమాదం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద జరిగింది. ఈరోజు తెల్లవారు జామున పవిత్ర జయరాం ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొని వెంటనే ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఆమె మరణించారు.
రోడ్డు ప్రమాదంలో...
పవిత్రా జయరాం త్రినయని సీరియల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. త్రినయని సీరియల్ లో తిలోత్తమ పాత్రతో ఆమె ప్రేక్షకులకు పరిచయం. కారులో ఉన్న పవిత్ర జయరాం మరణించగా, ఆహె కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ సీరియళ్లలో కూడా నటించారు. ఆమె మృతి తీరని లోటని కన్నడ బుల్లితెర పరిశ్రమ తెలిపింది.
Next Story