Mon Jun 23 2025 02:54:26 GMT+0000 (Coordinated Universal Time)
గాజులు, దుస్తులే ఆధారాలు.. 24 గంటల్లో కేసును చేధించిన పోలీసులు
గాజులు, దుస్తులే ఆధారాలు 24 గంటల్లో కేసును చేధించిన పోలీసులు

బాచుపల్లి శివార్లలోని ఒక లేఅవుట్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి పడేసిన హత్య కేసును దర్యాప్తు బృందాలు ఛేదించాయి. బుధవారం జిపిఆర్ లేఅవుట్ విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని పొదలలో పడేసిన సూట్‌కేస్ నుండి దుర్వాసన వస్తోందని స్థానికులు సమాచారం ఇచ్చారు. బాచుపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని 20-30 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఒక మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు.
హత్యను దర్యాప్తు చేయడానికి పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ఆమె గాజులు, దుస్తులు తప్ప, పోలీసులకు మొదట్లో వేరే ఆధారాలు దొరకలేదు. అయితే, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత, మృతదేహాన్ని ఉంచిన సూట్‌కేస్‌ను పడేసిన ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. బాచుపల్లి సీఐ మీడియాతో మాట్లాడుతూ, ఆ మహిళ నేపాల్‌కు చెందిన 33 ఏళ్ల తారాగా గుర్తించామని చెప్పారు. నిందితుడు మృతురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అన్నారు. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన అన్నారు.
Next Story