Tue Jan 13 2026 06:28:50 GMT+0000 (Coordinated Universal Time)
శరణార్థులుగా వచ్చి చోరీలు.. ముగ్గురు మయన్మార్ వాసులు అరెస్ట్
తెలంగాణ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. శరణార్ధులుగా వచ్చిన వారు చోరీలు చేస్తున్నారు

తెలంగాణ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. శరణార్ధులుగా వచ్చిన వారు చోరీలు చేస్తున్నారు. భారత్ లోకి శరణార్థులుగా వచ్చి చోరీలు చేస్తున్న మయన్మార్ దేశానికి చెందిన ముగ్గురు వ్యక్తులను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి దాదాపు 60 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మయన్మార్ దేశస్తులు...
చోరీలు చేస్తున్న మరో మయన్మార్ దేశస్థులు నలుగురు పరారీలో ఉన్నారు. నల్గొండ అడిషనల్ ఎస్పీ జి.రమేశ్ సోమవారం కేసు వివరాలను వెల్లడించారు. వీరు కంపెనీలను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్నారని, ఈ నెల 7వతన నల్గొండ టౌన్ పరిధిలోని ఒక కంపెనీలో చోరీ చేశారని తెలిపారు. పోలీసుల తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు.
Next Story

